Speaking to media persons here, YSRCP MLA and government chief whip Gadikota Srikanth Reddy alleged that former Chief Minister Chandrababu Naidu had taken commissions from the power companies for PPAs.
#gadikotasrikanthreddy
#JaganMohanReddy
#TDP
#ChandrababuNaidu
#ysrcp
పెయిడ్ ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గత ఐదేళ్లలో టీడీపీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు రాష్ట్రంలో మాఫియా పాలనను సాగించారన్నారు. ఎవరు ఏ రకమైన అరాచకాలు చేశారో ప్రజల వద్దే తేల్చుకోవడానికి చర్చకు రావాలని గడికోట సవాలు విసిరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో గడికోట మాట్లాడారు. జన్మభూమి కమిటీల అరాచకాలపై చర్చిద్దామని చంద్రబాబుకు దమ్మూ... ధైర్యం ఉంటే సిద్ధమా అంటూ సవాలు విసిరారు.